ఆహ్మదాబాద్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. కివీస్ పై 168 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది.1 మొదట ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. కానీ ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
శుభ్ మన్ గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్ లతో 126 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన త్రిపాఠీ కూడా తనదైన శైలిలో వేగంగా ఆడాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యాకుమార్ యాదవ్ 24 పరుగులు చేశారు. హర్ధిక్ పాండ్యా 30 పరుగులు చేశాడు. దీపక్ హుడా 2 పరుగులు చేశాడు.
235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోను భారత్ కు పోటీ ఇవ్వలేదు. 66 పరుగులకే కుప్పకూలింది. డారిన్ మిచెల్ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్దిక్ పాండ్యా 4 వికెట్లు తీయగా.. హర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగారు భారత్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంంది.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి